అక్షరటుడే, వెబ్‌డెస్క్: Lokesh Yoga Session | విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పాల్గొన్నారు. యోగా గురు బాబా రాందేవ్‌తో కలిసి యోగాసనాలు చేశారు. అనంతరం యోగా దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
వ్యసన ముక్త భారత ప్రచార యాత్ర వాహనాన్ని జెండా ఊపి చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నగర వాసులు పెద్ద ఎత్తున యోగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబా రామ్‌దేవ్.. మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh)తో పలు ఆసనాలు వేయించారు. లోకేశ్ ఉత్సాహంగా ఆసనాలు వేస్తుండటాన్ని చూసి, పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు నవ్వారు. కాగా కష్టమైన ఆ ఆసనాలు వేయడానికి లోకేశ్ కొంచెం శ్రమించారు.
Lokesh Yoga Session | ప్రధానికి ధన్యవాదాలు

యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందన్నారు. వచ్చే ఏడాది తిరుపతిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేశ్‌తో యోగా గురువు రాందేవ్ బాబా యోగాసనాలు వేయించారు. #InternationalYogaDay #naralokesh #ramdevbaba #yogandhra pic.twitter.com/tBqoKF0uwq
— Akshara Today | Telugu News (@aksharatoday) June 21, 2026
ఇది కూడా చదవండి..: Khammam Tragedy | పిల్లలకు ఎలుకల మందు తాగించి తల్లి ఆత్మహత్యాయత్నం