అక్షరటుడే, వెబ్డెస్క్ : Rajanarasimha Yoga Message | యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) సూచించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Rajanarasimha Yoga Message | యోగా గొప్ప కానుక
మంత్రి మాట్లాడుతూ… ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప కానుక యోగా అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే హెల్తీ ఫ్యామిలీ, హెల్తీ సోసైటీ, హెల్తీ తెలంగాణ ఉండాలన్నారు. పాఠశాల నుంచి కాలేజీ స్థాయి వరకు విద్యార్థులకు యోగాను పరిచయం చేస్తున్నామన్నారు. యోగా గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా కృషి చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో హనుమంతు, డైరెక్టర్ స్పోర్ట్స్ సోనీ బాలాదేవి, మెడికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర డైరెక్టర్ నరేంద్ర కుమార్, రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: NEET Exam Pressure | NEETకు ముందు విషాదం.. హైదరాబాద్‌లో విద్యార్థిని ఆత్మహత్య