అక్షరటుడే నిజామాబాద్ అర్బన్: NEET Exam | జిల్లా వ్యాప్తంగా ‘నీట్’ ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లాలోని ఎనిమిది సెంటర్లలో పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
NEET Exam | నలుగురు విద్యార్థులు ఆలస్యం..
నగరంలోని గిరిరాజ్ కళాశాల లో ఏర్పాటుచేసిన నీట్ పరీక్ష కేంద్రానికి నలుగురు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. ఒక విద్యార్థి బోధన్ నుంచి రావాల్సి ఉండగా మార్గమధ్యంలో కారు పాడవడంతో విద్యార్థి పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చాడు. అయితే సమయం దాటిన కారణంగా అధికారులు పరీక్ష కేంద్రంలోకి విద్యార్థిని అనుమతించలేదు. అలాగే మరో ముగ్గురు విద్యార్థులు సైతం 1:30 లోపు పరీక్ష కేంద్రానికి రావాల్సి ఉండగా సమయానికి రాలేదు. ఈ నలుగురిని అధికారులు పరీక్షకు అనుమతించలేదు.
NEET Exam | కఠిన నిబంధనల కారణంగా..

దేశవ్యాప్తంగా రెండోసారి జరుగుతున్న “నీట్”కు అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అలాగే కఠిన నిబంధనలను అమలు చేశారు. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధికారుల కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డప్పటికీ కేంద్రంలోకి వారిని అనుమతించలేదు. దీంతో విద్యార్థులు రోదిస్తూ తిరిగి వెళ్లిపోయారు.
NEET Exam | వాటర్ బాటిళ్ళు..బంగారు ఆభరణాలు..
కఠిన నిబంధనలు అమలులో ఉన్న కారణంగా విద్యార్థులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రంలోకి అనుమతించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు బంగారు గొలుసులు వేసుకొని రాగా వాటిని తీసేయించారు. అలాగే కొంతమంది విద్యార్థినుల చెప్పులు, వాటర్ బాటిళ్లను అనుమతించలేదు. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi), ఉన్నతాధికారులు తనిఖీ చేశారు.
ఇది కూడా చదవండి..: Ganja Smuggling Arrest | గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్