CM Vijay Temple Funds | ఆలయ నిధులు ఇకపై మతపరమైన అవసరాలకే : డీఎంకే ప్రాజెక్టులపై సీఎం విజయ్ ‘సర్జికల్ స్ట్రైక్’!

హిందూ దేవాలయాల నిధుల వినియోగంపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత డీఎంకే (DMK) ప్రభుత్వం దేవాలయాల నిధులతో చేపట్టాలని భావించిన సుమారు ₹246 కోట్ల విలువైన 46 ప్రాజెక్టులను రద్దు చేస్తూ విజయ్ ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CM Vijay Temple Funds | రాజకీయాల్లో కొందరు కేవలం ప్రసంగాలకే పరిమితమై, అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షాలపై విమర్శలతో కాలక్షేపం చేస్తుంటే.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మాత్రం అనవసర శబ్దాలు చేయకుండా సైలెంట్​గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. తాజాగా ఆయన తీసుకున్న ఒక నిర్ణయం హిందూ సమాజంతో పాటు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

గత డీఎంకే (DMK) ప్రభుత్వం హిందూ దేవాలయాల నిధులను వాణిజ్య అవసరాలకు మళ్లించేలా ప్రణాళికలు వేయగా.. సీఎం విజయ్ వాటిపై ‘సర్జికల్ స్ట్రైక్’ చేశారు.

హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ (HR&CE) శాఖ పరిధిలోని ఆలయ నిధులతో చేపట్టాలనుకున్న ₹246 కోట్ల విలువైన 46 ప్రాజెక్టులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు విజయ్ ప్రభుత్వం ప్రకటించింది.

CM Vijay Temple Funds | గత ప్రభుత్వం ఏం చేయాలనుకుంది?

గత డీఎంకే హయాంలో ఆలయాల నిధులను ఉపయోగించి రాష్ట్రవ్యాప్తంగా 29 కళ్యాణ మండపాలు, 17 వాణిజ్య (కమర్షియల్) సముదాయాలను నిర్మించాలని పరిపాలన అనుమతులు మంజూరు చేశారు.

అయితే, ఆలయ సొమ్మును ఇలాంటి వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడంపై అప్పట్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. విజయ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించి, ఇంకా పనులు ప్రారంభం కాని వీటన్నింటినీ తక్షణమే రద్దు చేస్తూ జీవో (GO) జారీ చేసింది.

CM Vijay Temple Funds | రద్దుకు దారితీసిన ముఖ్య కారణాలు:

  • ఆలయాల ఆర్థిక రక్షణ: పెద్ద ఎత్తున నిధులను మళ్లించడం వల్ల ఆలయాలు ఆర్థికంగా దివాలా తీసే ప్రమాదం ఉందని ప్రభుత్వం గుర్తించింది.
  • న్యాయపరమైన చిక్కులు: దేవుడి సొమ్మును దేవుడి కార్యక్రమాలకే వాడాలనే హిందూ ధర్మశాస్త్రాలు, న్యాయస్థానాల తీర్పులను గౌరవించడం.
  • ఆలయాల పవిత్రత: వాణిజ్యీకరణ కంటే ఆధ్యాత్మికతకే పెద్దపీట వేయడం.

CM Vijay Temple Funds | దేవుడి సొమ్ము.. దేవుడికే!

ఈ సందర్భంగా విజయ్ ప్రభుత్వం ఒక కీలకమైన భరోసా ఇచ్చింది. “హిందూ ఆలయాల ద్వారా వచ్చే ప్రతి రూపాయి ఇకపై కేవలం మతపరమైన అవసరాలకు, ఆలయాల నిర్వహణకు, భక్తుల సౌకర్యాల మెరుగుదలకు మాత్రమే వినియోగించబడుతుంది” అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మాటల కంటే పనులకే ప్రాధాన్యం ఇచ్చే విజయ్ స్టైల్ చూస్తుంటే.. రాబోయే రోజుల్లో తమిళనాడులో మరిన్ని వ్యవస్థాగత మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

గత ప్రభుత్వాల తప్పులను సరిదిద్దుతూ, ఆలయ ఆస్తులను కాపాడేందుకు విజయ్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంపై భక్తులు, హిందూ సంఘాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

International Yoga Day | ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం ఘన విజయం సాధించింది: ప్రధాని మోడీ

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *