అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Journalists | కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) అభివృద్ధిలో జర్నలిస్టులు సైతం భాగస్వామ్యం కావాలని మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. ఇటీవల నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీయుడబ్ల్యూజే (ఐజేయూ) (TUWJ IJU) జిల్లా కమిటీ నాయకులు సోమవారం మున్సిపల్ ఛైర్నర్సన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Kamareddy Journalists | ప్రభుత్వానికి, ప్రజల మధ్య వారధులు..
నూతన కమిటీని ఛైర్పర్సన్ దంపతులు సన్మానించారు. పారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య జర్నలిస్టులు వారధులుగా పని చేస్తారని, సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమన్నారు. పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు తమ అమూల్యమైన సలహాలు, సూచనలు అందించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు రాజేష్, శివ, శ్రీకాంత్, వెంకన్న, రాము, అబీద్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: క్రిమినల్స్‌కు ఎలాంటి కుల, మతాలు ఉండవు’