Junaid Ali | అంతర్జాతీయ వేదికపై జిల్లా న్యాయవాదికి అరుదైన అవకాశం

అంతర్జాతీయ వేదికపై నిజామాబాద్​ న్యాయవాదికి అరుదైన అవకాశం లభించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Junaid Ali | అంతర్జాతీయ వేదికపై నిజామాబాద్​ (Nizamabad) న్యాయవాదికి అరుదైన అవకాశం లభించింది. ఈనెల 29, 30తేదీల్లో థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో(Bangkok Conference) జరగనున్న 7వ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్(Global Conference on Climate) అండ్ ఎస్​డీజీ సినర్జీస్​లో ఇండియా తరపున జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త, న్యాయవాది మహ్మద్ జునైద్ అలీ ప్రాతినిథ్యం వహించనున్నారు.

Junaid Ali | ప్రతిష్టాత్మకమైన సదస్సులో..

ఈ సదస్సు ఐక్యరాజ్యసమితి ఈఎస్సీఏపీ, డీఈఎస్ఏల సహకారంతో జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల మధ్య సమన్వయంపై చర్చించనున్నారు. మహ్మద్ జునైద్ అలీ తన అనుభవాన్ని, జ్ఞానాన్ని ఈ చర్చల్లో పంచుకోనున్నారు. ఈ అంతర్జాతీయ వేదిక, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి ఎస్డీజీలను సాధించడానికి అవసరమైన వ్యూహాలపై దృష్టి సారిస్తుంది. మహ్మద్ జునైద్ అలీ గతంలో పలు సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని, న్యాయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. ఆయన ఎంపిక నిజామాబాద్​కు గర్వకారణమని, యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడ్డారు. పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాద సంఘాల సభ్యులు జూనైద్ అలీకు శుభాకాంక్షలు తెలిపారు.

nizamabad 2

ఇది కూడా చదవండి: ‘రేవంత్ రెడ్డి రైతుబంధు నిధులు జమ చేస్తానని

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *