Mamata Banerjee TMC | బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. TMC చీఫ్​ పదవి నుంచి మమత తొలగింపు!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mamata Banerjee TMC | పశ్చిమ బెంగాల్ పాలిటిక్స్​లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రిటబ్రత బెనర్జీ నాయకత్వంలోని తృణమాల్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు మమతను టీఎంసీ (TMC) చీఫ్ పదవి నుంచి తప్పించారు.

దీనికితోడు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని ఆ పదవి నుంచి తప్పించమే కాకుండా.. పార్టీ నుంచి ఏకంగా సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులు ప్రకటించారు. ఇక దీదీ స్థానంలో నూతన ఛైర్మన్​గా హౌరా సెంట్రల్ ఎమ్మెల్యే అరూప్ రాయ్​ను నియమించారు.

arup ray

Mamata Banerjee TMC | పలు కీలక నిర్ణయాలు..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇటీవల టీఎంసీ శాసనసభా పక్షం రెండుగా చీలింది. రిటబ్రత బెనర్జీ నేతృత్వంలో సుమారు 60 మంది శాసన సభ్యులు తిరుగుబావుటా ఎగురేశారు.

ఈ క్రమంలో శాసనసభలో  ప్రతిపక్ష నేత రిటబ్రత బెనర్జీ నేతృత్వంలో సోమవారం (జూన్​ 22) కోల్​కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలో టీఎంసీ తిరుగుబాటు వర్గం సమావేశమైంది.

సుమారు 60 మంది రెబల్ ఎమ్మెల్యేలతోపాటు 70 మంది కౌన్సిలర్లు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీఎంసీ చీఫ్ మమతను పార్టీ ఛైర్​పర్సన్​ పదవి నుంచి తొలగించారు. మమతా బెనర్జీ స్థానంలో సీనియర్ నాయకుడు అరూప్ రాయ్​ను నూతన ఛైర్మన్​గా ఎన్నుకున్నారు.

Mamata Banerjee TMC

Mamata Banerjee TMC | TMC నూతన కార్యవర్గం

తమదే ఒరిజినల్​ టీఎంసీ అని ప్రకటించుకున్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. తాజాగా పార్టీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పార్టీ జాతీయ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

సీనియర్ నాయకులు అరూప్ బిశ్వాస్, ఫిర్హాద్ హకీమ్, రథిన్ ఘోష్, సబినా యాస్మిన్ లను టీఎంసీ పార్టీ వైస్​ ఛైర్మన్​లుగా నియమించారు.

టీఎంసీ జాతీయ కార్యవర్గాన్ని 2022, ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు పునరుద్ధరించలేదని ఈ సందర్భంగా రెబల్​ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ నేపథ్యంలో తాము ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందాక.. వరుస దెబ్బలతో సతమతమవుతున్న మమతకు ఇది భారీ ఎదురు దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

School Kitchen Shed | బడి రుణం.. తమ్ముడి స్మరణం: సిరికొండ జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థి అక్షరార్చన!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *