అక్షరటుడే, వెబ్‌డెస్క్: Parawada Pharma City Fire | అనకాపల్లి జిల్లా (Anakapalle District) పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.
పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున ప్లాస్టిక్ పైరోలిసిస్ ఆయిల్ తయారీ కంపెనీ దక్షిణ్ ఎనర్జీలో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పలువురు కార్మికులు ఫ్యాక్టరీలో చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేశారు.
Parawada Pharma City Fire | గుడిమల్కాపూర్‌లో..
హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వింటేజ్ ఫంక్షన్ హాల్ సమీపంలో గల చెక్క ఫ్యాక్టరీలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. మంటలు పక్కనే ఉన్న మరో రెండు ఫ్యాక్టరీలకు వ్యాపించాయి. అగ్ని మాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు.
పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం..
Ap : అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవదహనం కాగా, మరో ఇద్దరు చిక్కుకున్నట్లు సమాచారం.#Parawada #FireAccident… pic.twitter.com/V7OVHiWxVK
— Akshara Today | Telugu News (@aksharatoday) June 23, 2026
ఇది కూడా చదవండి..: Sisters Missing Case | తల్లి మందలించిందని.. ఇంట్లోంచి వెళ్లిపోయిన అక్కాచెల్లెళ్లు