NEET Exam Abolition | నీట్​ పరీక్షను రద్దు చేయాలి : తమిళనాడు సీఎం విజయ్​

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NEET Exam Abolition | నీట్​ పరీక్షను రద్దు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్​ (Tamilnadu CM Vijay) మరోసారి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు.

NEET Exam Abolition | ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల కారణంగా

నీట్ పరీక్ష తమిళనాడులోని వైద్య విద్యార్థులకు అన్యాయం చేస్తోందని రాష్ట్ర అసెంబ్లీలో తెలిపారు. అలాగే, విద్యార్థులపై ఏ భాషనూ రుద్దడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడు సంక్షేమానికి సంబంధించిన సమస్యలు రాజకీయ విభేదాలకు అతీతంగా ఉండాలని విజయ్ నొక్కి చెప్పారు. అవకతవకలు, ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల కారణంగా మే 3న జరగాల్సిన నీట్ పరీక్ష (NEET Exam) రద్దు కాగా, జూన్ 21న పునఃపరీక్ష జరిగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీఎంకే నాయకుడు అన్బుమణి రామదాస్, ఈ పరీక్షను రద్దు చేయాలని లేదా దాని నుండి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

NEET Exam Abolition | ఐక్యంగా పోరాడాలి

NEET Exam Abolition

అసెంబ్లీలో మాట్లాడుతూ విజయ్ తమిళనాడు సంక్షేమానికి సంబంధించిన విషయాలపై మనం ఏకమైతే, రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలుస్తుంది అన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, ప్రజల ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరోవైపు, తాను నేరుగా సినీ పరిశ్రమ నుండే రాజకీయాల్లోకి వచ్చానన్న విమర్శలను విజయ్ తోసిపుచ్చారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో స్పీకర్​ అనుమతితో సినిమాటిక్​ లెవల్​లో చేయితో సైగ చేస్తూ ప్రసంగం ముగించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి..: Ajit Doval BRICS Security | కొత్త భద్రతా సవాళ్లపై అప్రమత్తంగా ఉండాలి : అజిత్​ దోవల్​

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *