అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Udhayanidhi Stalin Remarks | టీవీకే ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీని సీఎం విజయ్ సినిమా హాల్‌లా మార్చారని విమర్శించారు.
తమిళనాడు అసెంబ్లీ (Tamil Nadu Assembly) సమావేశాలను మంగళవారం డీఎంకే వాకౌట్ చేసింది. అనంతరం ఉదయనిధి స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో కూడా విజయ్ నటించడం మొదలు పెట్టారన్నారు. విజయ్ నటిస్తుంటే స్పీకర్ కట్ చెబుతున్నారని విమర్శించారు. మళ్లీ స్పీకర్ యాక్షన్ అంటే విజయ్ నటిస్తున్నారని ఆరోపించారు. రేపటి నుంచి అసెంబ్లీకి కార్‌వాన్, మేకప్ మ్యాన్, ఫైట్ మాస్టర్లను తీసుకొస్తారేమో అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మంత్రులు విజిల్ వేస్తున్నారు, త్వరలో ఐటమ్ సాంగ్స్‌కి డాన్సులు వేస్తారన్నారు.
Udhayanidhi Stalin Remarks | అసత్యాలు ప్రచారం

విజయ్ (CM Vijay) ఎన్నికల ప్రచారంలో మాట్లాడినట్లుగానే సభలో మాట్లాడారని విమర్శించారు. అసత్యాలను ప్రస్తావించడంతో తాము అభ్యంతరం వ్యక్తం చేశామని తెలిపారు. విమర్శలు హద్దులు దాటినప్పటికీ, ముఖ్యమంత్రి విజయ్ తనతో తెచ్చుకున్న ప్రసంగ పాఠాన్ని పూర్తిగా చదివేందుకు స్పీకర్ అనుమతించారన్నారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదన్నారు. ఆయన ఎప్పుడూ మీడియాకు, ప్రతిపక్ష పార్టీలకు గానీ సమాధానం ఇవ్వరన్నారు. ముఖ్యమంత్రిగా ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Padma Awards 2026 | ఢిల్లీ వేదికగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం