అక్షరటుడే, వెబ్‌డెస్క్: Animal Park | భారతీయ సినీ పరిశ్రమలో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) వంగా, కేవలం మూడు సినిమాలతోనే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు.
ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Pan-India Star Prabhas)తో కలిసి తెరకెక్కిస్తున్న స్పిరిట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, వంగా తదుపరి ప్రాజెక్ట్‌గా తెరకెక్కనున్న యానిమల్ పార్క్‌పై ఆసక్తికర రూమర్లు వినిపిస్తున్నాయి. రణ్‌బీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ బ్లాక్‌బస్టర్ విజయంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
Animal Park | డ్యూయల్ రోల్ .. భారీ ట్విస్ట్
‘యానిమల్ పార్క్’లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) డ్యూయల్ రోల్లో కనిపించనున్నారని, ఈసారి పాత్రను మరింత ఇంటెన్స్‌గా, పవర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తున్నారని టాక్. క్రైమ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో కీలక మలుపు వద్ద ఓ స్పెషల్ కామియో ప్లాన్ చేస్తున్నారట. ఆ స్పెషల్ కామియో కోసం ప్రభాస్ పేరే బలంగా వినిపిస్తోంది. కథలో కీలకమైన సందర్భంలో ప్రభాస్ ఎంట్రీ ఇస్తే సినిమా స్కేల్ మరో స్థాయికి చేరుతుందని మేకర్స్ భావిస్తున్నారట. మాస్ ఆడియన్స్‌కి ఇది భారీ సర్ప్రైజ్ అవుతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సందీప్ వంగా ‘స్పిరిట్’ కోసం ప్రభాస్‌తో పని చేస్తుండగా, గతంలో ‘యానిమల్’తో రణబీర్‌కు భారీ హిట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి మధ్య మంచి అనుబంధం ఉండటంతో ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.
Animal Park | బాలీవుడ్ – టాలీవుడ్ కలయికలో భారీ సెన్సేషన్
‘యానిమల్ పార్క్’ సినిమా ‘స్పిరిట్’ (Spirit )తర్వాత సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ప్రభాస్ కామియోపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతం ఇది కేవలం రూమర్ మాత్రమే అయినప్పటికీ, నిజమైతే బాలీవుడ్ – టాలీవుడ్ కలయికలో భారీ సెన్సేషన్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. మొత్తంగా, సందీప్ రెడ్డి వంగా తదుపరి ప్రాజెక్ట్‌లపై వస్తున్న ప్రతి వార్త కూడా సినీ ప్రేమికుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇది కూడా చదవండి..: Jacqueline Sukesh letter | లవ్ యూ బుట్ట బొమ్మ జాక్వీ.. ప్రేమతో బేబీ బాయ్ సుఖేశ్!

