Urea Booking Issues | యూరియా కోసం అవస్థలు.. నిమిషాల్లో ఖాళీ అవుతున్న స్టాక్​

రాష్ట్రంలో యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. యాప్​లో బుక్​ చేసుకోవడం తెలియక ఆందోళన చెందుతున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Urea Booking Issues | రాష్ట్రంలో యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పంటలు వేసే సీజన్​ కావడంతో అందరు రైతులు యూరియా కోసం నిరీక్షిస్తున్నారు. అయితే ప్రభుత్వం యాప్ (Fertilizer app)​ ద్వారా బుకింగ్​ విధానం తీసుకు రావడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఫెర్టిలైజర్​ యాప్​ ద్వారా యూరియా బుకింగ్​కు అవకాశం కల్పించింది. ఎకరాకు రెండు సంచుల యూరియా ఇస్తోంది. అది కూడా విడతల వారిగా.. మండలాన్ని యూనిట్​గా తీసుకొని యూరియా సరఫరా చేస్తోంది. ఏ మండలంలోని రైతులు.. అదే మండల పరిధిలో యూరియా బుక్​ చేసుకోవాలి.

Urea Booking Issues | 3 కాగానే.. ఫోన్లు పట్టుకొని

యూరియా స్టాక్​ రాగానే అధికారులు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్​లైన్​లో అప్​లోడ్​ చేస్తున్నారు. అయితే అప్పటికే వందలాది మంది రైతులు ఫోన్లు పట్టుకొని రెడీగా ఉంటున్నారు. అలా ఆన్​లైన్​లో స్టాక్ అప్​డేట్​ చేయగానే బుక్​ చేస్తున్నారు. దీంతో క్షణాల్లో స్టాక్​ అయిపోతుంది. వందల బస్తాలు 30 సెకన్లలోపు బుక్​ అవుతున్నాయి. దీంతో స్మార్ట్​ ఫోన్​ లేని, వినియోగించడం రాని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3 గంటలకు స్టాక్​ అప్​లోడ్​ చేయగా.. ఒక నిమిషం తర్వాత బ్యాగుల సంఖ్య సున్న అని చూపుతోంది.

Urea Booking Issues | భారీగా డిమాండ్​

ప్రస్తుతం సీజన్​ ప్రారంభం కావడంతో యూరియాకు భారీగా డిమాండ్​ ఉంది. ముందు ముందు దొరుకుతుందో లేదోనని, పనులు ప్రారంభం అయితే తెచ్చుకోవడం వీలు కాదని రైతులు ఇప్పుడే బుక్​ చేసుకోవాలని చూస్తున్నారు. దీంతో క్షణాల్లో వేల బ్యాగులు అయిపోతున్నాయి. అయితే మరో వారం, పది రోజులు అయితే యూరియా తిప్పలు తప్పే అవకాశం ఉంది. ఒకసారి బుక్​ చేసుకున్న రైతులు రెండో దశ కోసం 15 రోజులు ఆగాల్సి ఉంటుంది. దీంతో రద్దీ తగ్గి అందరికి యూరియా దొరుకుతుందని అధికారులు చెబుతున్నారు. రైతులు మాత్రం యూరియా కోసం ఆందోళన చెందుతున్నారు.

దీనిని కూడా చదవండి: Minister Seethakka | గ్రామాల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : మంత్రి సీతక్క 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *