అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao Letter | తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను తక్షణమే విరమించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలన్నారు.
సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అతిపెద్ద అన్యాయాల్లో నీళ్ల దోపిడీ ఒకటని హరీశ్‌రావు (Harish Rao Letter) పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను దశాబ్దాల పాటు దోచుకోవడంతో లక్షల ఎకరాలు బీడు భూములుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా జలాలను తెలంగాణ భూములకు మళ్లించి కరవును పారద్రోలి, పాలమూరు వంటి వలసల జిల్లాలను పచ్చని పంటలతో కళకళలాడేలా చేసిందని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ జల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించి, రాష్ట్ర ప్రయోజనాలను పక్క రాష్ట్రాల వద్ద తాకట్టు పెడుతోందని ఆరోపించారు.
Harish Rao Letter | అనుమతి ఇచ్చినట్లే..
నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను ఏపీ తరలించుకు పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించిందని, తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలో అలాగే వ్యవహరిస్తోందన్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు కర్ణాటక నుంచి NOC తెస్తున్నాం అనే సాకు చెప్పి, తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చారా అని ప్రశ్నింఆరు. తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న కురిడి (2 TMC), చిక్కాల పర్వి (2.5 TMC), చిక్కాలమంచి (5 TMC) బ్రిడ్జ్-కమ్-బరాజ్లకు మీ ప్రభుత్వం సమ్మతి తెలిపిందా అని అడిగారు. కర్ణాటక అక్రమ నిర్మాణాలపై అభ్యంతరం చెప్పలేదంటే పరోక్షంగా వాటికి మీరు అనుమతించినట్లేనా అన్నారు.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి @revanth_anumula గారికి,
విషయం: తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను తక్షణమే విరమించాలి – తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలి.@TelanganaCMO @UttamINC pic.twitter.com/HOXFtWs2RX
— Harish Rao Thanneeru (@BRSHarish) June 24, 2026
దీనిని కూడా చదవండి : Urea Booking Issues | యూరియా కోసం అవస్థలు.. నిమిషాల్లో ఖాళీ అవుతున్న స్టాక్