అక్షరటుడే వెబ్‌డెస్క్: Hormuz Strait Shipping | హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) కీలక ప్రకటన చేశారు. ఈ జలసంధి మార్గంలో ప్రయాణించే నౌకల నుండి ఎటువంటి అదనపు రుసుములు, బీమా ఖర్చులు లేదా సుంకాలు వసూలు చేయబోమని ఇరాన్ హామీ ఇచ్చిందని ఆయన వెల్లడించారు. ఒకవేళ ఇరాన్ ఇచ్చిన ఈ హామీని ఉల్లంఘిస్తే, వారితో జరుపుతున్న చర్చలను వెంటనే నిలిపివేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.
Hormuz Strait Shipping | ఇరాన్‌కు నిధులపై స్పష్టత..
ఇరాన్‌కు ఎటువంటి ఆర్థిక సహాయం చేయడం లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌కు చెందిన నిధుల్లో కొంత భాగాన్ని, అమెరికా రైతులు , పశుపోషకుల నుండి ఆహార పదార్థాలను (మొక్కజొన్న, గోధుమలు, సోయాబీన్) కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తామని వివరించారు. ఇరాన్‌లో ప్రస్తుతం ఆహారానికి తీవ్ర కొరత ఉందని, ఆ అవసరాలను తీర్చేందుకు అమెరికా నుండే ఆహార ధాన్యాలను సరఫరా చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Hormuz Strait Shipping | పెరిగిన రాకపోకలు..
హర్మూజ్ జలసంధి గుండా చమురు రవాణా , నౌకల రాకపోకలు గణనీయంగా పెరిగాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా మీడియా కథనాల ప్రకారం.. జూన్ 12-14 మధ్య 32 నౌకలు ప్రయాణించగా, జూన్ 19-21 నాటికి ఆ సంఖ్య ఏకంగా 93కి పెరిగింది. నౌకలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా జలసంధిని దాటుతున్నాయని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఇది కూడా చదవండి: TU Exams | తెలంగాణ యూనివర్సిటీలో పరీక్షల షెడ్యూల్ విడుదల