అక్షరటుడే, వెబ్‌డెస్క్: Elon Wealth | పది రోజుల్లోనే సీన్ రివర్సయ్యింది. స్పేస్ ఎక్స్ షేర్లలో భారీ పతనంతో ఎలాన్ మస్క్ సంపద రూ. 47 లక్షల కోట్ల వరకు తగ్గడంతో ట్రిలియనీర్ (Trillionaire Status) హోదా కోల్పోయారు.
Elon Wealth | స్పేస్ ఎక్స్ ఐపీవో..
ఈనెల ప్రారంభంలో స్పేస్ ఎక్స్ ఐపీవోకు (SpaceX Shares) వచ్చిన విషయం తెలిసిందే. ఇది జూన్ 12న నాస్డాక్లో లిస్టయి సంచలనం సృష్టించింది. 75 బిలియన్ డాలర్ల ఐపీవోగా రికార్డు నెలకొల్పింది. ఇన్వెస్టర్లకు సైతం కాసుల పంట పండించింది. ఐపీవో(IPO) తర్వాత కంపెనీ మార్కెట్ క్యాప్ 3 ట్రిలియన్ డాలర్లకు చేరువైంది. దీంతో మస్క్ సంపద సైతం భారీగా పెరిగి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా అవతరించారు.
Elon Wealth | ఆనందం ఆవిరి..
135 డాలర్ల ధరతో ఐపీవోకు వచ్చిన స్పేస్ ఎక్స్.. 150 డాలర్ల వద్ద లిస్టయి భారీ లాభాలను అందించింది. ఇది పది రోజుల్లో 225 డాలర్ల వరకు పెరిగింది. ఈ క్రమంలో మస్క్ సంపద 1.45 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే తొలి ట్రిలియనీర్‌గా రికార్డు నెలకొల్పిన ఆనందం మస్క్‌కు పట్టుమని పది రోజులు కూడా నిలవలేదు. ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ బాండ్లను విక్రయిస్తామని మస్క్ ప్రకటించడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. నాలుగు రోజుల్లో షేర్ల ధర గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో ఆయన సంపద రూ. 47 లక్షల కోట్ల వరకు తగ్గడంతో 957 బిలియన్ డాలర్ల వద్ద ఉంది.
ఇది కూడా చదవండి: సమంత తల్లి కాబోతోందా?