Rain Forecast | నేడు పలు జిల్లాలకు మోస్తరు వర్ష సూచన

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rain Forecast | రాష్ట్రంలో గత మూడు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. దీంతో వాతావరణం చల్లబడింది. వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. గురువారం పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు.

ఉత్తర, పశ్చిమ, మధ్య తెలంగాణ (Telangana) జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం, రాత్రి వేళ వర్షం పడుతుంది. దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వానలు పడుతాయి. హైదరాబాద్​ నగరలో సైతం రాత్రి వేళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.

Rain Forecast | జోరుగా సాగు పనులు

Rain Forecast

రాష్ట్రంలో వానలు పడుతుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వర్షాకాలం ప్రారంభమై 25 రోజులు అవుతున్నా.. మూడు, నాలుగు రోజుల నుంచే వర్షాలు పడుతున్నాయి. దీంతో రైతులు పొలం పనుల్లో బిజీ అయ్యారు. వరినాట్లు వేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Metro controversy | మెట్రోపై రేవంత్ రెడ్డి ‘తుగ్లక్’ మార్క్: 25 నిప్పుల అస్త్రాలతో విరుచుకుపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *