అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bakery Fire Accident | కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా (Asifabad District) కాగజ్‌నగర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి ఓ బేకరీలో మంటలు చెలరేగాయి.
కాగజ్‌నగర్ పట్టణంలోని బెంగుళూరు అయ్యంగార్ బేకరీలో ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బేకరీ యజమానులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అర్ధరాత్రి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Bakery Fire Accident | కారు దగ్ధం
ఖమ్మం జిల్లా పరిధిలోని వేంసూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే లింగపాలెం ఎగ్జిట్ వద్ద కారు దగ్ధమైంది. కారు టైర్ పేలి, రైలింగ్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా కాలిబూడిద అయింది. హైదరాబాద్ నుంచి ఎర్రవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కారులోని ఏడుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఇది కూడా చదవండి..: Telangana SIR | రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రారంభం