అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Nalgonda | ఈ నెల (జూన్) 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా అభివృద్ధిని వేగవంతం చేయడంలో భాగంగా సుమారు రూ. 13,000 కోట్ల భారీ బడ్జెట్‌తో చేపట్టనున్న ఆర్‌అండ్‌బీ (R&B) ‘హ్యామ్’ (HAM) రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే అధికారులతో కలిసి సమీక్షించారు.
Revanth Reddy Nalgonda | పర్యటన వివరాలు..
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా నేరుగా నల్లగొండ జిల్లా కనగల్ మండలానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30 గంటలకు కనగల్ ఏఎంసీ (AMC) మార్కెట్ యార్డ్ వద్ద హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పైలాన్‌ను ఆయన ఆవిష్కరిస్తారు. అనంతరం, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తొలి విడత మంచినీటి సరఫరా ప్రాజెక్టు పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు.
Revanth Reddy Nalgonda | ఎన్జీ కాలేజీలో భారీ సభ..
అభివృద్ధి పనుల శంకుస్థాపన తర్వాత, నల్లగొండలోని ఎన్జీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే, జిల్లాలోని స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలకు ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను పంపిణీ చేస్తారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు నల్లగొండ కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Digital Arrest Scam | డిజిటల్ అరెస్ట్ స్కామ్స్.. 16 రాష్ట్రాల్లో సీబీఐ మెరుపు దాడులు