Balka Suman Release | చంచల్‌గూడ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల

బెయిల్ ప్రక్రియ పూర్తికావడంతో బాల్క సుమన్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన విడుదల సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు జైలు వద్దకు చేరుకుని స్వాగతం పలికారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Balka Suman Release | బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చంచల్‌గూడ కేంద్ర కారాగారం నుంచి గురువారం విడుదలయ్యారు. సింగరేణిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆయనకు కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేయడంతో విడుదలకు మార్గం సుగమమైంది.

Hyderabad Water Crisis | ఐటీ హబ్‌ల తళతళల వెనుక ‘జల’ సంక్షోభం: భాగ్యనగరంలో పాతాళంలోకి భూగర్భ జలాలు!

Balka Suman Release | జైలు వద్ద స్వాగతం

కోర్టు విధించిన షరతుల మేరకు బెయిల్ ప్రక్రియ పూర్తికావడంతో బాల్క సుమన్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన విడుదల సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు జైలు వద్దకు చేరుకుని స్వాగతం పలికారు.

సింగరేణి సంస్థకు సంబంధించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన కేసులో బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

అనంతరం బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంచల్‌గూడ జైలు నుంచి బాల్క సుమన్ విడుదలయ్యారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *