Janu Missing Case | జాను మిస్సింగ్ కేసు.. కుక్క మృతిపై క్లియర్ అయిన అనుమానాలు

కాకినాడ జిల్లా తునిలో దాదాపు 23 రోజులుగా కొనసాగుతున్న చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) మిస్సింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Janu Missing Case | కాకినాడ జిల్లా   ( Kakinada ) తునిలో దాదాపు 23 రోజులుగా కొనసాగుతున్న చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) మిస్సింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో భాగంగా అనుమానాలకు తావిచ్చిన వారి పెంపుడు కుక్క మరణంపై ఫోరెన్సిక్ ల్యాబ్ కీలక నివేదిక ఇచ్చింది.

Janu Missing Case | అసలు నిజం ఇదే..

జూన్ 13న ఆ పెంపుడు కుక్క మరణించడంతో, దాన్ని ఎవరైనా విషప్రయోగం చేసి చంపేశారా అన్న అనుమానాలు తలెత్తాయి. దీనిపై పశువైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించి, నమూనాలను విశాఖపట్నంలోని ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం, కుక్కకు ఎలాంటి విషప్రయోగం జరగలేదని, ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏర్పడిన తీవ్ర అనారోగ్యంతోనే అది సహజంగా చనిపోయిందని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో కుక్కను చంపేశారనే అనుమానాలకు ఫుల్‌స్టాప్ పడింది.

tuni.1

Janu Missing Case | ముమ్మరంగా గాలింపు..

మరోవైపు, చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసు యంత్రాంగం దర్యాప్తును వేగవంతం చేసింది. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి అన్ని కోణాల్లో విచారణ చేపట్టాయి. నిరంతరం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. స్థానికుల కదలికలను కూడా నిశితంగా గమనిస్తూ, చిన్నారిని కనుగొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో, త్వరలోనే చిన్నారి జాడ దొరుకుతుందని స్థానికులు ఆశతో ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Gold Man Surya Bhai | ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అరెస్ట్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *