అక్షరటుడే, ఇందూరు: SIR Voter Revision | సమగ్ర ఓటరు సవరణ జాబితాపై ప్రజలకు అవగాహన ఉండాలని 21వ డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి లలిత చరణ్ అన్నారు. సర్ సమగ్ర ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియలో భాగంగా డివిజన్లో సర్వే నిర్వహించారు.
SIR Voter Revision | సీనియర్ అడ్వకేట్ కృపాకర్రెడ్డికి..
నిజామాబాద్ (Nizamabad) మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్తో కలిసి డివిజన్లో కార్పొరేటర్ సర్ ప్రక్రియలో భాగంగా సీనియర్ అడ్వకేట్ కృపాకర్ రెడ్డికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. అనంతరం కార్పొరేటర్ పంచ రెడ్డి లలిత చరణ్ మాట్లాడుతూ.. సర్(SIR) ప్రక్రియ పట్ల ప్రజలు అప్రమత్తలతో అవగాహనతో ఉండాలన్నారు. లేని పక్షంలో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని, ఓటు ఉంటేనే ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకానికి మనం అర్హులం అవుతామన్నారు. డివిజన్ ప్రజలందరూ వారి వారి వివరాలను సర్ ప్రక్రియలో భాగంగా వచ్చే అధికారులకు సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రత్యేక అధికారి ప్రశాంత్, వార్డ్ ఆఫీసర్ ఐశ్వర్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షోయబ్, డివిజన్ బూత్ లెవెల్ ఆఫీసర్స్, డివిజన్ జవాన్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Voter Enumeration Forms | ప్రతీ ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలివ్వాలి