అక్షరటుడే వెబ్‌డెస్క్: Sanjay Jaju | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నియామకానికి సంబంధించి ప్రభుత్వం జీఓ నంబర్ 911 ద్వారా ఉత్తర్వులను జారీ చేసింది.
Sanjay Jaju | గవర్నర్ ఆదేశాల మేరకు ..
ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ కాలం ముగిసిన వెంటనే, సంజయ్ జాజు ఆ బాధ్యతలను స్వీకరిస్తారు. గవర్నర్ ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ ఈ నియామక ప్రక్రియను పూర్తి చేసింది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న సంజయ్ జాజును ఈ అత్యంత కీలకమైన పదవికి ఎంపిక చేయడంపై సచివాలయ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

తెలంగాణ సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీగా సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజు తెలంగాణకు తిరిగి వచ్చారు. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం… pic.twitter.com/ukpOovBZ0H
— Akshara Today | Telugu News (@aksharatoday) June 26, 2026
ఇది కూడా చదవండి: Child Marriage Prevention | ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పెళ్లి కార్డులపై పుట్టిన తేదీలు తప్పనిసరి!