అక్షరటుడే, కామారెడ్డి: Deer Accident | అడవిలో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ జింక ఏకంగా పట్టణంలోకి(Kamareddy) వచ్చి బైక్ను ఢీకొంది.
Deer Accident | కలెక్టరేట్ నుంచి గ్రామానికి వెళ్తుండగా..
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రామారెడ్డి (Ramareddy) మండలం ఉప్పలవాయి గ్రామానికి చెందిన మేదరి శ్రీనివాస్ తన భార్య గంగమణితో కలిసి కామారెడ్డికి వచ్చాడు. పనులు ముగించుకుని కలెక్టరేట్(Kamareddy Collectorate) నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా పక్క నుంచి ఒక్కసారిగా వచ్చిన జింక స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్తకు కాలు విరగగా భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి: వెనుజువెలాకు భారత్ భారీ సాయం..