Dubai Shopping Lucky Draw | రూ. 13 వేల షాపింగ్‌తో కలిసొచ్చిన అదృష్టం​.. ఏకంగా దుబాయ్‌లో ఉచిత ఇల్లు!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dubai Shopping Lucky Draw | దుబాయ్‌లో నివాసం ఉంటున్న కేరళకు చెందిన ఆయేషా అమీర్ (27)  అనే భారత మహిళను అదృష్టం మామూలుగా తగలలేదు. దుబాయ్ సర్కారు నిర్వహించిన ఓ షాపింగ్ లక్కీ డ్రాలో ఈ యువతి ఒక లగ్జరీ స్టూడియో అపార్ట్‌మెంట్‌ను పూర్తి ఉచితంగా గెలుచుకుంది.

School Kitchen Shed | బడి రుణం.. తమ్ముడి స్మరణం: సిరికొండ జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థి అక్షరార్చన!

Dubai Shopping Lucky Draw | లగ్జరీ ప్రాపర్టీ డెవలపర్ బింఘట్టి

విన్ యువర్ హోమ్ ఇన్ దుబాయ్ (Win Your Home in Dubai) అనే ఒక సిటీ-వైడ్ షాపింగ్ ప్రమోషన్‌ను దుబాయ్ ఛాంబర్స్, దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DFRE) సంయుక్తంగా నిర్వహించాయి.

ఇందులో ఎవరైనా భాగస్వామ్య అవుట్‌లెట్లలో కనీసం 500 దిర్హామ్‌లు (సుమారు రూ.13,000) విలువైన షాపింగ్ చేయాలి. అనంతరం అక్కడ QR కోడ్‌ను స్కాన్ చేసి బిల్లును అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే వారు లక్కీ డ్రాకు అర్హత పొందుతారు. ఈ ప్రమోషన్‌లో లగ్జరీ ప్రాపర్టీ డెవలపర్ బింఘట్టి (Binghatti) ఉచిత అపార్ట్‌మెంట్లను అందజేస్తోంది.

Hyderabad Water Crisis | ఐటీ హబ్‌ల తళతళల వెనుక ‘జల’ సంక్షోభం: భాగ్యనగరంలో పాతాళంలోకి భూగర్భ జలాలు!

Dubai Shopping Lucky Draw | ప్రథమ విజేత…

దుబాయ్‌లో బిజినెస్ కన్సల్టెంట్‌గా ఉన్న ఆయేషా, తన భర్తతో కలిసి సదరు మాల్‌లో షాపింగ్​ చేసింది. 500 దిర్హామ్‌ల షాపింగ్ బిల్లుతో లక్కీ డ్రాలో రిజిస్టర్ చేసుకుంది.

ఆ తర్వాత లక్కీ డ్రాలో తొలి వారంలోనే విజేతగా ఆయేషా నిలిచింది. ఈ క్రమంలో ఆమెకు విలాసవంతమైన స్టూడియో అపార్ట్‌మెంట్​ను నిర్వాహకులు బహుమతిగా అందజేశారు. కాగా, బహుమతి గెలుచుకున్నట్లు కాల్​ రాగానే.. ఆమె దీనిని స్పామ్​ కాల్​గా భ్రమపడటం గమనార్హం.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *