Kukatpally Illegal Constructions | కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

కూకట్‌పల్లి KPHB కాలనీ ఎంఆర్​వో ఆఫీస్ లైన్‌లో వెలసిన అక్రమ నిర్మాణాలను జీహెచ్​ఎంసీ అధికారులు తొలగించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kukatpally Illegal Constructions | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ఓ వైపు హైడ్రా.. మరోవైపు జీహెచ్​ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.

నగరంలోని అల్వాల్​లో హైడ్రా అధికారులు శనివారం 108 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడారు. మరోవైపు జీహెచ్​ఎంసీ సిబ్బంది కూకట్‌పల్లి KPHB కాలనీ ఎంఆర్​వో ఆఫీస్ లైన్‌లో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఇష్టారాజ్యంగా నిర్మించిన కట్టడాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానిక ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. దీంతో అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

Kukatpally Illegal Constructions | ఫుట్​పాత్​ల ఆక్రమణ

హైదరాబాద్​ నగరంలో ఫుట్​పాత్​లను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. పాదచారుల కోసం నిర్మించిన వీటిపై వ్యాపారాలు చేసుకుంటున్నారు. అక్రమంగా షెడ్లు నిర్మిస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నడుస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఫుట్​పాత్​లపై ఆక్రమణలు తొలగించేందుకు అధికారులు ప్రతి శనివారం స్పెషల్​ డ్రైవ్​ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా కేపీహెచ్​బీ (KPHB)లో ఆక్రమణలు తొలగించారు. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: HYDRAA Alwal Demolitions | అల్వాల్​లో హైడ్రా కూల్చివేతలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *