Amaravati Political Tension | వైసీపీ వర్సెస్​ టీడీపీ.. అమరావతిలో ఉద్రిక్తత

అమరావతిలోని ఉండవల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Amaravati Political Tension | ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh) రాజకీయాలు హీట్​ ఎక్కాయి. మొన్నటి వరకు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్న నాయకులు తాజాగా దాడులకు దిగుతున్నారు. తాజాగా అమరావతిలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

వైసీపీ నాయకులు శనివారం అమరావతి పర్యటనకు నిర్ణయించారు. రాజధాని భూములను పరిశీలించడానికి నాయకులు వెళ్లారు. పేర్నినాని, లేళ్ల అప్పిరెడ్డి, సీఆర్డీఏ పరిరక్షణ బృందం సభ్యులు అమరావతికి వెళ్లగా.. వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. మరోవైపు వైసీపీ నేతల పర్యటనకు నిరసనగా ఉండవల్లి సెంటర్‌లో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, టీడీపీ శ్రేణులు ధర్నా చేశాయి. వైసీపీ నేతలు గో బ్యాక్ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ‘అమరావతి’ని అంగీకరించాకే పర్యటించాలని డిమాండ్​ చేశారు.

Amaravati Political Tension | పలువురికి గాయాలు

వైసీపీ నేతలను టీడీపీ సానుభూతిపరులు అడ్డుకున్నారు. వారిపై కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి కారు ధ్వంసం అయింది. CRDA పరిరక్షణ కమిటీ సభ్యులు, పోలీసులపై టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు సైతం గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. టీడీపీ, వైసీపీ నాయకులు తోసుకోవడంతో పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి వైసీపీ నాయకులు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నట్లు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి..: Sai Krishna Lockup Death | సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. కీలక వ్యక్తి అదుపులోకి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *