Pulse Polio Campaign | పోలియో రహిత సమాజం మనందరి లక్ష్యం..

పోలియో రహిత సమాజం మనందరి లక్ష్యమని అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్థలు) భుజంగరావు అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Pulse Polio Campaign | పోలియో రహిత సమాజం మనందరి లక్ష్యమని అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్థలు) భుజంగరావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

Pulse Polio Campaign | ఆదివారం పల్స్​ పోలియో..

నగరంలోని బస్టాండ్, తిలక్ గార్డెన్ చౌరస్తా మీదుగా డీఐవో ఆఫీసు వరకు పోలియో అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులందరికి జూన్ 28 ఆదివారం పల్స్ పోలియో (Pulse Polio) చుక్కల మందును అందించాలన్నారు. ఏ ఒక్కరు తప్పిపోకుండా పకడ్బందీ ప్రణాళికతో కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. జూన్ 28 ఆదివారం బూత్​ వద్ద ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కల మందు వేస్తారని, బూత్​ వద్ద చుక్కల మందు వేయించని చిన్నారులకు జూన్ 29, 30 తేదీల్లో గృహ సందర్శన చేసి మందు అందించాలన్నారు. పోలియోపై అవగాహన కలిగించే పోస్టర్లను అడిషనల్ కలెక్టర్ ఆవిష్కరించారు.

Pulse Polio Campaign | జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 1,91,883 మంది

Pulse Polio Campaign

 

ర్యాలీ అనంతరం డీఎంహెచ్​వో రాజశ్రీ మాట్లాడుతూ.. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు మొత్తం 1,91,883 ఉన్నారన్నారు. వీరందరికి పోలియో చుక్కలు వేయడానికి 1,007 బూత్​లను ఏర్పాటు చేసినట్లు, పట్టణ కేంద్రాల్లో 241 బూత్​లను, గ్రామీణ ప్రాంతాల్లో 766 బూత్​లను, 37 ట్రాన్సిట్ బూత్​లను, 37 మొబైల్ బూత్​లను, 101 పర్యవేక్షణ అధికారులను, 4,277 బూత్​ మెంబర్లను, 428 ఆరోగ్య కార్యకర్తలను, 1,112 ఆశ కార్యకర్తలను, 1,501 అంగన్​వాడీ కార్యకర్తలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమం కోసం 2,11,100 పోలియో డోసులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో జీజీహెచ్​ సూపరింటెండెంట్ రాములు, డీఐవో అశోక్, డిప్యూటీ డీఎంహెచ్​వో సికందర్ నాయక్, ప్రోగ్రాం అధికారులు వెంకన్న, నవ్య, వెంకటేష్, వైద్యాధికారులు అజ్మతున్నిసా, సుసేన, ప్రత్యూష, ప్రతాప్, ఎస్​వో రాజేశ్వర్, డిప్యూటీ డెమో దుర్గారావు, డీహెచ్ఈలు ఘన్​పూర్​ వెంకటేశ్వర్లు, మనోహర్, సలీం తదితరులున్నారు.

ఇది కూడా చదవండి..: Student Welfare Facilities | విద్యార్థులకు సౌకర్యాలు అందేలా పర్యవేక్షించాలి: ప్రత్యేక అధికారి విజయేంద్ర

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *