అక్షరటుడే, ఎల్లారెడ్డి : Pulse Polio Campaign | కామారెడ్డి జిల్లా (Kamareddy District)లో జాతీయ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం ఆదివారం చేపట్టారు. జిల్లాలోని ఐదేళ్లలోపు 1,03,678 మంది చిన్నారులకు వ్యాక్సినేషన్ లక్ష్యంగా నిర్ణయించినట్లు డీఎంహెచ్ వో వెంకట్ తెలిపారు.
Pulse Polio Campaign | 3 రోజుల కార్యాచరణ..
జిల్లావ్యాప్తంగా పల్స్ పోలియోకు మూడురోజుల కార్యాచరణ రూపొందించారు. ఆదివారం జిల్లావ్యాప్తంగా ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బూత్‌లలో పోలియో డ్రాప్స్ వేసే కార్యక్రమం చేపట్టారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా బూత్‌లను ఏర్పాటు చేశారు. హైరిస్క్ ప్రాంతాలను మొబైల్ టీమ్‌లు కవర్ చేస్తాయి. బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ట్రాన్సిట్ టీమ్‌లు బూత్‌లు ఏర్పాటు చేశాయి. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోలేని వారి కోసం మంగళ, బుధవారాల్లో ఇంటింటికీ వెళ్లి వేయనున్నారు.

Pulse Polio Campaign | జిల్లాలో ఇమ్యూనైజేషన్ వివరాలు..
జిల్లా మొత్తం జనాభా 10,79,796 ఉండగా.. ఐదేళ్లలోపు చిన్నారులు 1,03,678 మంది ఉన్నారు. అలాగే మొత్తం ఇళ్లు 2,14,165 ఉన్నాయి. ఇందులో భాగంగా 733 బూత్‌లను ఏర్పాటు చేశారు. 20 పీహెచ్‌సీలు ఉండగా.. రెండు యూపీహెచ్‌సీలు ఉన్నాయి. అలాగే 28 కోల్డ్ చెయిన పాయింట్లు, 74మంది సూపర్వైజర్లు, 22 మొబైల్ టీంలు, 174 హైరిస్క్ పాయింట్లు ఉన్నాయి. మొత్తంగా 1,31,974 డోస్‌లను చిన్నారుల కోసం సిద్ధంగా ఉంచారు. వీటిని వేసేందుకు 2,552మంది ఆశా, ఏఎన్ఎం, ఏడబ్ల్యూ,డబ్ల్యూ వలంటీర్లు పనిచేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని అర్హులైన వయసు పిల్లలందరికీ bOPV వ్యాక్సిన్ వేయడమే ఈ కార్యక్రమం తుది లక్ష్యమని డీఎంహెచ్‌వో తెలిపారు.
ఇది కూడా చదవండి..: Bodhan Chain Snatching | చైన్ స్నాచింగ్ కలకలం.. మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరణ