Saudi Aramco Helicopter Crash | సౌదీలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. 14 మంది దుర్మరణం

సౌదీ అరేబియాలో జరిగిన ఒక విషాదకర ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక నగరం ‘రాస్ తానూరా’ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Saudi Aramco Helicopter Crash | సౌదీ అరేబియాలో జరిగిన ఒక విషాదకర ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక నగరం ‘రాస్ తానూరా’ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రపంచ ప్రసిద్ధ చమురు దిగ్గజం ‘సౌదీ అరామ్కో’ సంస్థకు చెందిన హెలికాప్టర్ కూలిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది.

Saudi Aramco Helicopter Crash | ప్రమాదం ఎలా జరిగిందంటే..

చమురు క్షేత్రాల పర్యవేక్షణ , రవాణా విధుల్లో భాగంగా ఈ హెలికాప్టర్ ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురైంది. సమాచారం అందిన వెంటనే సౌదీ సివిల్ డిఫెన్స్, అరామ్కో రక్షణ విభాగాలు , భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో అందులో ప్రయాణిస్తున్న 14 మంది అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారంతా సౌదీ పౌరులేనని అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి.

Saudi Aramco Helicopter Crash | దర్యాప్తు ప్రారంభం..

హెలికాప్టర్ ఎందుకు కుప్పకూలిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేదా వాతావరణ పరిస్థితులు కారణమా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది.

ఇది కూడా చదవండి:  NEET Protest | ప్రధాని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *