Armoor BJP Protest | ఆర్మూర్​లో బీజేపీ నాయకుల నిరసన ర్యాలీ..

ఆర్మూర్​ పట్టణంలో సోమవారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: Armoor BJP Protest | పట్టణంలో సోమవారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్​ చౌరస్తా వద్దకు ఉదయాన్నే హిందు సంఘాల సభ్యులు భారీగా చేరుకొని ర్యాలీ నిర్వహించారు.

Armoor BJP Protest | భరత చంద్ర పాఠశాలలో..

ఆర్మూర్ మున్సిపల్ (Armoor Municipality) పరిధిలోని పెర్కిట్ భరతచంద్ర పాఠశాలలో హిందూ విద్యార్థులకు ఉర్దూ, నమాజ్ నేర్పడం పట్ల తల్లిదండ్రులు, బీజేపీ, హిందూ సంఘాల నాయకులు రెండ్రోజుల క్రితం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూర్​లో నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే ఉదయం పోలీసులు, బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని అడ్డుకున్నప్పటికీ నాయకులు ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా  హైదరాబాద్ నుండి ఆర్మూర్​కు వస్తున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Rakesh Reddy)ని భిక్కనూరు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​కు తరలించారు. భరత్​ చంద్ర పాఠశాలను సీజ్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం ఆర్మూర్ ఎంఈవో రాజగంగారాంకు వినతి పత్రం అందజేశారు. కాగా పోలీసులు బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలును అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ కంచెట్టి గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి, యామాద్రి భాస్కర్ ప్రజలు పాల్గొన్నారు.

Armoor BJP Protest

ఇది కూడా చదవండి..: Hostel Food Issues | హాస్టళ్లలో ఆకలి కేకలు..: అందని బ్రేక్​ఫాస్ట్.​. విద్యార్థుల ఆరోగ్యంపై నీలినీడలు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *