Vangalapudi Anitha | గంజాయి సాగును అరికట్టాం : ఏపీ హోం మంత్రి అనిత

డ్రగ్స్ రహిత ఏపీ కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గంజాయి సాగును అరికట్టామని తెలిపారు.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vangalapudi Anitha | డ్రగ్స్ రహిత ఏపీ కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. గంజాయి సాగును సున్నాకు చేర్చడం వల్లే రాష్ట్రంలో నేరాల రేటు 14 శాతం తగ్గిందన్నారు.

హోం మంత్రి అనిత సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘ఈగల్’ టాస్క్‌ఫోర్స్ ద్వారా 1.20 లక్షల కేజీల గంజాయిని ధ్వంసం చేశామని, స్మగ్లర్ల రూ. 24 కోట్ల ఆస్తులను జప్తు చేశామని తెలిపారు. గంజాయి మూలాలను అరికట్టే యత్నం చేస్తున్నామన్నారు. మాదకద్రవ్యాల నుంచి బయట పడాలంటే ప్రజల సహకారం అవసరం అన్నారు. ఈ బాధ్యతను అందరం భుజాలపై వేసుకొని ముందుకు సాగాలని సూచించారు.

Vangalapudi Anitha | 2027 నాటికి అమరావతి నిర్మాణం

అమరావతి (Amaravati) అందరి కలల రాజధాని అని, 2027 నాటికి దీని నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. వైసీపీ నేతలు రౌడీ షీటర్లతో కలిసి అమరావతిలో గందరగోళం సృష్టించి, ఈ ప్రాజెక్టును పక్కదారి పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. పోలీసులు వారించినా వినకుండా రైతులను రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. రౌడీ షీటర్లతో వెళ్లి కావాలని గొడవకు కారణం అయ్యారని ఆరోపించారు. ఇన్ని రోజులు అమరావతి రాజధాని వద్దన్న వారు ఈ రోజు అమ‌రావ‌తి రైతు ప‌రిర‌క్ష‌ణ చేస్తామ‌ని వెళ్తాం అంటే ఎవ‌రికైనా క‌డుపు మండుతుందన్నారు. అందుకే రైతులు దాడి చేశారన్నారు.

Vangalapudi Anitha | బీచ్​ షాక్స్​పై కీలక వ్యాఖ్యలు

Vangalapudi Anitha

బీచ్ షాక్స్ పై హోం మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆలోచన సీఎం చంద్రబాబుదే అన్నారు. దీనిని పైలెట్ ప్రాజెక్ట్​గా ప్రభుత్వం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోవా తరహాలో తీర ప్రాంత పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి, స్థానిక ఉపాధిని పెంపొందించడానికి సముద్ర తీరాలలో బీచ్​ షాక్స్‌ (తాత్కాలిక చెక్క, వెదురు కుటీరాలు) ఏర్పాటుకు మార్గదర్శకాలు జారీ చేసింది. విశాఖ పట్నం, సూర్యలంకలో దీనిని మొదట అమలు చేస్తారు. ఇందులో మద్యం అమ్మకాలు చేపడుతారు. ముందు అందరూ బీచ్ షాక్స్​కి సహకరించాలని హోం మంత్రి కోరారు. పొరపాట్లు ఏమైనా ఉంటే అప్పుడు చెప్పాలన్నారు.

ఇది కూడా చదవండి..: Idupu Kayitham Controversy 1 | ‘ఇడుపు కాయితం’ వివాదం అనవసరం.. సినిమాను సినిమాగానే చూడాలి: సీనియర్ నటుడు నరేశ్

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *