Employee Health Scheme | ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకం

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఉద్యోగుల కోసం ఆరోగ్య పథకం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Employee Health Scheme | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఉద్యోగుల కోసం ఆరోగ్య పథకం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఉద్యోగుల కుటుంబ సభ్యులు, వారిపై ఆధారపడ్డ వారీక EHS అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ తమ మూల వేతనంలో 1.5 శాతం మొత్తాన్ని ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం’ (EHS) నిధికి జమ చేయడాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే మొత్తం ప్రభుత్వం కూడా జమ చేయనుంది.

Employee Health Scheme | ట్రస్ట్​ ఏర్పాటు

ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలు కోసం ప్రభుత్వం ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT)ను ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల సంఘాలు, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో కూడిన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని శాఖాధిపతులు, కలెక్టర్లు, డ్రాయింగ్, డిస్బర్సింగ్ అధికారులు, 2026 మే నెలకు, 2026 జూన్ నెల నుండి చెల్లించబడే జీతాలు మరియు పెన్షన్ల నుండి, ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) నిధికి వాటాగా వారి మూల వేతనం/మూల పెన్షన్‌పై 1.5 శాతం మినహాయించాలని ఆదేశించింది.

Employee Health Scheme | ఒక్కరికి మాత్రమే..

telangana 4

భార్యాభర్తలు ఇద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నప్పుడు ఒక్కరి అకౌంట్​ నుంచి మాత్రమే డబ్బులు కట్ చేస్తారు. జీవిత భాగస్వాములలో ఒకరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, మరొకరు రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారు అయినప్పుడు అయిన కూడా ఒకరి వేతనంలో కోత విధిస్తారు.

దీనిని కూడా చదవండి : Musi River Project | ‘మూసీ’ బాధితులకు డబుల్ ​ఇళ్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాస‌ రెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *