అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Karnataka SIR Process | కర్ణాటకలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సదాశివనగర్‌లోని తన నివాసంలో ప్రారంభించారు.
ఎన్నికల సంఘం (Election Commission) అధికారులు ఎన్యుమరేషన్ ఫారాన్ని అందజేయగా.. ఆయన దానిని పూర్తి చేసి సమర్పించి, ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి మొదటి ప్రతినిధిగా, SIR నేడు తన ఇంటి నుంచే ప్రారంభమైందన్నారు. ఫారంలో వివరాలు నింపడం కష్టంగా అనిపించిందని పేర్కొన్నారు. ప్రజలు ఈ ఫారాన్ని జూలై 29వ తేదీలోగా పూరించి సమర్పించాలని సూచించారు. ఎస్ఐఆర్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు పోతే ప్రభుత్వ పథకాలు అందడం కష్టం అవుతుందన్నారు.
Karnataka SIR Process | ధృవపత్రం సమర్పించాలి

2002కు ముందు ఓటు వేయని కొత్త ఓటర్లు, చెల్లుబాటు అయ్యే నివాస ధృవీకరణ పత్రం లేదా కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని సీఎం తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా చూసుకోవాలని కోరారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను పూర్తి చేయడంలో ప్రజలకు సహాయపడటానికి రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలను జారీ చేస్తుందని ప్రకటించారు.
SIR కోసం శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలను జారీ చేయనున్న కర్ణాటక ప్రభుత్వం
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను పూర్తి చేయడంలో పౌరులకు సహాయపడటానికి రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలను జారీ చేస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు. ఎస్ఐఆర్ డ్రైవ్… pic.twitter.com/wOryoG14ph
— Akshara Today | Telugu News (@aksharatoday) June 30, 2026
ఇది కూడా చదవండి..: Modi Review Meeting | నేడు ప్రధాని మోదీ కీలక సమావేశం