Pulse Polio | పల్స్ పోలియోను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి

పల్స్ పోలియోను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్​ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pulse Polio | పల్స్ పోలియోను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆర్డీవో ప్రభాకర్​ అన్నారు. పట్టణంలో కొనసాగుతున్న పల్స్ పోలియో(Polio Campaign) కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు.

Pulse Polio | అంగన్​వాడీలో..

పట్టణంలోని (Yellareddy) అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి ఐదేళ్లలోపు చిన్నారులకు స్వయంగా చుక్కల మందు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజం నిర్మించేందుకు ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతోందన్నారు. దేశంలో పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయని తెలిపారు. ఒక్క చిన్నారి కూడా మందు వేసుకోకుండా ఉండవద్దని.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకెళ్లాలని కోరారు. వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు ఇంటింటికీ తిరిగి 5 ఏళ్లలోపు పిల్లలందరికీ చుక్కల మందు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Pulse Polio 1

ఇది కూడా చదవండి : Tribal University Convocation | వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువతదే కీలక పాత్ర: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *