అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Revanth Reddy Remarks | రాష్ట్రంలో కేసీఆర్ అన్ని కల్చర్లను నాశనం చేసి, తాగుడు కల్చర్ తెచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శిల్ప కళా వేదికలో రైతు భరోసా నిధులను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
కేసీఆర్ హయాంలో ప్రతి వీధిలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారన్నారు. విద్యార్థులు సైతం మద్యానికి బానిసులు కావడానికి కేసీఆర్ కారణం అని ఆరోపించారు. ఆయన దీనికి బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. సాయంత్రం 6 కాకముందే 16 ఏళ్ల పిల్లలు గోడలు పట్టుకొని నడిచే పరిస్థితి ఉందన్నారు. పిల్లలను తాగుబోతులు చేసిన కేసీఆర్ మళ్లీ రావాలని కేటీఆర్, హరీశ్‌రావు తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy Remarks | మూడేళ్లకే కూలింది
బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తే మూడేళ్లకే కూలిందన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్టర్లకు రూ.1.02 లక్షల కోట్లను ప్రభుత్వం చెల్లించిందన్నారు. గతంలో ఎక్కడ పంటలు బాగా పండిన కాళేశ్వరం పేరు చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయలేదని, మరి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. రైతులు కష్టపడి పండించిన వడ్లను కాళేశ్వరం నీళ్లలో పండించారని కేసీఆర్ కథలు చెప్పారని మండిపడ్డారు. ఇలా ఎన్ని రోజులు మోసం చేస్తారని ప్రశ్నించారు.
Revanth Reddy Remarks | కేసీఆర్ ఎందుకు రావాలి
ఇటీవల కేటీఆర్ బయటకు వెళ్లి కేసీఆర్ మళ్లీ వస్తారని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ కేసీఆర్ ఎందుకని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు సార్లు మోసం చేశారని, దళితులకు మూడు ఎకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదన్నారు. ఏం చేశారని మళ్లీ అధికారంలోకి వస్తారన్నారు.
Revanth Reddy Remarks | చర్చకు సిద్ధం

బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కేంద్రంలో బీజేపీ 12 ఏళ్ల పాలన, రెండున్నరేళ్ల తమ పాలనపై చర్చకు సిద్ధం అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అనేక పనులు చేసినట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని మోదీ చెప్పారని, ఎవరికైనా వచ్చాయా అన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, కానీ తెలంగాణలో బండి సంజయ్, కిషన్‌రెడ్డికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారన్నారు. రాష్ట్రానికి చిల్లిగవ్వ ఇచ్చారా అని ప్రశ్నించారు.
Revanth Reddy Remarks | బీజేపీ పప్పులు ఉడకవు
తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ఆ పార్టీ నాయకులు మోదీ పేరు చెబుతారని విమర్శించారు. ఇక్కడ గల్లీలో డ్రెయినేజీలు తీయకపోతే మోదీని వెళ్లి అడగాలా అని సెటైర్లు వేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి నితిన్ నబిన్ పర్యటనపై సీఎం స్పందించారు. ఆయన తెలంగాణలో బీజేపీ వస్తుంది అంటున్నారని, కానీ సాధ్యం కాదన్నారు. బెంగాల్లో 15 పట్టిందని ఇక్కడ కూడా అదే గతి పడుతుందన్నారు.
Revanth Reddy Remarks | అదే చేస్తాడు
కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే రైతు భరోసా వేయరన్నారు. వడ్లు కొనడం మానేస్తారని సీఎం ఆరోపించారు. గతంలో వరి వేసుకుంటే ఉరే అన్న కేసీఆర్ తన ఫామ్ హౌజ్‌లో పండిన వడ్లను మాత్రం రూ.4,200 క్వింటాల్‌కు అమ్ముకున్నారని ఆరోపించారు. అధికారం ఉందని కంపెనీలను భయపెట్టి కొనేలా చేశారని విమర్శించారు. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే భార్యభర్తలు ఫోన్లు మాట్లాడుకున్నా వింటారన్నారు. అది తప్పా ఆయన ఏమి చేయలేరని విమర్శించారు. ఫోన్లు వినడానికే ఫామ్ హౌజ్‌లో ఉంటారని ఎద్దేవా చేశారు. ఆఖరకు ఆయన బిడ్డ కూడా ఈ విషయం చెప్పిందన్నారు.
‘కేసీఆర్.. అగ్రికల్చర్, హార్టికల్చర్ ఇలా అన్ని కల్చర్లు నాశనం చేశారు.. ఓన్లీ తాగుడు కల్చర్ తెచ్చి పెట్టిండు.. కాంగ్రెస్ హయాంలో రైతులకు బజార్లు ఇస్తే.. కేసీఆర్ ఊరూరా బెల్ట్ బజార్లు తెరిచిండు.. కేసీఆర్ దేనికైనా బ్రాండ్ అంబాసిడర్ అంటే..’ — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
A. Revanth… pic.twitter.com/kdPexsw60G
— Akshara Today | Telugu News (@aksharatoday) June 30, 2026
దీనిని కూడా చదవండి : Rythu Bharosa Funds | రైతు భరోసా నిధులు విడుదల..