Sports Ground Development | క్రీడామైదానం అభివృద్దికి శాయశక్తులా కృషి చేస్తా: ఎంపీ సురేష్​ షెట్కార్​

Shashi kiran Mottala

అక్షరటుడే, గాంధారి: Sports Ground Development | క్రీడామైదానం అభివృద్దికి శాయశక్తులా కృషి చేస్తామని ఎంపీ సురేష్​ షెట్కార్ (MP Suresh Shetkar) అన్నారు.​ యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమని.. దానికి నిదర్శనమే ఈ మైదానమని ఆయన పేర్కొన్నారు. మండలంలోని (Gandhari) మొకరంపేట హన్మాండ్లు ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని గురువారం ప్రారంభించారు.

Sports Ground Development | యువత దేశానికి వెన్నెముక..

అనంతరం ఎంపీ సురేష్ మాట్లాడుతూ యువత దేశానికి వెన్నుముక లాంటివారన్నారు. వారు తలుచుకుంటే ఏదైనా సాధ్యమని.. అంతేకాకుండా యువత అంతా ఏకమై మైదానాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే అది అద్భుతమైన విషయమన్నారు. వారికి నా వంతు సహాయ సహకారంగా హైమాస్ట్​ లైట్లు, గ్రౌండ్ ఫెన్సింగ్, గ్రౌండ్ వరకు సీసీ రోడ్డు ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటున్నానని హామీ ఇచ్చారు. దీని గురించి ఎమ్మెల్యే మదన్​మోహన్​తో (MLA Madan Mohan) కలిసి చర్చిస్తానన్నారు. అనంతరం బ్యాటింగ్ చేస్తూ తన చిన్నప్పటి గుర్తులను జ్ఞాపకం చేసుకున్నారు. కార్యక్రమంలో జీపీఎల్ కమిటీ నిర్వాహకులు, జీపీఎల్ కెప్టెన్ సభ్యులు, క్రీడాకారులు, ఆయా పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ACB raids | రిజిస్ట్రార్​ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *