Vishal Akula | జాతీయ ఐఎంఏ అవార్డుకు నిజామాబాద్ వైద్యుడు విశాల్ ఆకుల

నిజామాబాద్​ ఐఎంఏ అధ్యక్షుడు విశాల్​ ఆకుల ప్రతిష్టాత్మక ‘డాక్టర్ కేతన్​ దేశాయ్​..అవో గావ్​ చలేన్​’ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Vishal Akula | నిజామాబాద్​ ఐఎంఏ (Nizamabad IMA) అధ్యక్షుడు విశాల్​ ఆకుల ప్రతిష్టాత్మక ‘డాక్టర్ కేతన్​ దేశాయ్​..అవో గావ్​ చలేన్​’ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో (Government Medical College) మానసిక వైద్య విభాగం విభాగాధిపతి, ప్రొఫెసర్ న్యూరో సైకియాట్రిస్ట్, మాదకద్రవ్యాల వ్యసన నివారణ నిపుణుడిగా ఆయన సేవలందిస్తున్నారు.

Vishal Akula | గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు..

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) గ్రామీణ ఆరోగ్య సేవలు, కమ్యూనిటీ మానసిక ఆరోగ్య కార్యక్రమాలు, మాదకద్రవ్యాల వ్యసన నివారణపై కృషి చేస్తున్న వైద్యులు ఏటేటా గుర్తించి అవార్డులు అందిస్తోంది. ఇందులో భాగంగా డాక్టర్​ విశాల్​ ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాలు, సమాజానికి అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఐఎంఏ జాతీయ ప్రధాన కార్యాలయం విడుదల చేసిన సమాచారం ప్రకారం, జూలై 18న న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించే జాతీయ వైద్యుల దినోత్సవ అవార్డుల ప్రదానోత్సవంలో ఐఎంఏ జాతీయ నాయకత్వం సమక్షంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

Vishal Akula | రోగులకు, సహచర వైద్యులకు అవార్డు అంకితం..

ఈ సందర్భంగా డాక్టర్​ విశాల్ ఆకుల మాట్లాడుతూ, ఈ పురస్కారానికి ఎంపిక చేసిన ఐఎంఏ జాతీయ అధ్యక్షులు అనిల్‌కుమార్ జే. నాయక్, గౌరవ ప్రధాన కార్యదర్శి సర్బారి దత్తాలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్, గౌరవ ప్రధాన కార్యదర్శి అశోక్ దయాల్ సింగ్, గౌరవ కోశాధికారి దయాల్ సింగ్​లకు తమ ప్రోత్సాహం, మార్గదర్శకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా వైద్యులు రవీంద్ర రెడ్డి, జీవన్ రావు, హరీష్ స్వామి, ఐఎంఏ నిజామాబాద్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డును తన రోగులకు, సహచర వైద్యులకు, విద్యార్థులకు, గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న ప్రతి ఆరోగ్య కార్యకర్తకు అంకితం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన, అందుబాటులో ఉండే, శాస్త్రీయ ఆధారాలతో కూడిన ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

vishal vishal

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *