అక్షరటుడే వెబ్డెస్క్: K Kavitha Speech | సికింద్రాబాద్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ( K Kavitha ) ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
K Kavitha Speech | భారీ ర్యాలీ..
సికింద్రాబాద్ ఇన్చార్జి బండారి మహేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చిలకలగూడ గాంధీ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీతాఫల్మండి నుంచి చిలకలగూడ వరకు జరిగిన భారీ ర్యాలీలో డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.సభలో కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఆశించిన ఫలితాలను ప్రజలు పూర్తిస్థాయిలో అందుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయని విమర్శించారు.

K Kavitha Speech | ముఖ్యమైన హామీలు..
అధికారంలోకి వస్తే ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను, ప్రతి కుటుంబానికి నాణ్యమైన ఉచిత వైద్య సేవలను అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అలాగే, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం కేటాయించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సికింద్రాబాద్ పాత్ర కీలకమని, భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని కవిత తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో బండారి మహేందర్ ముదిరాజ్ ఎప్పుడూ ముందుంటారని ఆమె అభినందించారు.
ఇది కూడా చదవండి: Operation Smile | బాల కార్మికులను రక్షించాలి : డీసీపీ శుభం ప్రకాశ్