WhatsApp Username Feature | వాట్సప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై మెటాకు కేంద్రం నోటీసులు

ఈ ఫీచర్ ద్వారా ఆన్‌లైన్ మోసాలు, ముఖ్యంగా డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: WhatsApp Username Feature | వాట్సప్‌లో ప్రతిపాదిత యూజర్ నేమ్ ఫీచర్ అమలుపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫీచర్‌ను అమల్లోకి తీసుకురావడానికి ముందు వివరణ ఇవ్వాలని వాట్సాప్ మాతృసంస్థ మెటాకు నోటీసులు జారీ చేసింది.

యూజర్ నేమ్ ఫీచర్ రోల్‌అవుట్‌కు సంబంధించిన అంశంపై మూడు రోజుల్లోగా పూర్తి వివరణ సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. అలాగే, తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ ఫీచర్‌ను అమల్లోకి తీసుకురావద్దని స్పష్టం చేసింది.

Commercial LPG Price | వ్యాపారులకు ఊరట.. భారీగా తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు

akshara today .jpgwatsapp

WhatsApp Username Feature | పలు అభ్యంతరాలు..

ఈ ఫీచర్ ద్వారా ఆన్‌లైన్ మోసాలు, ముఖ్యంగా డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. యూజర్ నేమ్‌లను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు తమ అసలు గుర్తింపును దాచిపెట్టి బాధితులను సులభంగా సంప్రదించే అవకాశం ఉంటుందని పేర్కొంది. ప్రజలను ప్రలోభపెట్టి మోసపూరిత సందేశాలు పంపేందుకు ఈ ఫీచర్ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని కేంద్రం అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో భద్రతాపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరమే తదుపరి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *