AMRUT 2.0 Works | అమృత్ 2.0 పనులను త్వరగా పూర్తి చేయాలి.. కలెక్టర్​

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అమృత్ 2.0 అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: AMRUT 2.0 Works | ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అమృత్ 2.0 అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అధికారులను ఆదేశించారు. పనులను గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

AMRUT 2.0 Works | ఎల్లారెడ్డి పెద్ద చెరువు పనులు..

ఎల్లారెడ్డి పెద్ద చెరువుపై చేపడుతున్న పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని కలెక్టర్​ ఆదేశించారు. ఎల్లారెడ్డికి వచ్చిన కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​ను ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పాలకవర్గం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పెద్ద చెరువులో నీటిమట్టం తగ్గాక పూడికతీత పనులు చేపట్టాలని కోరారు.అమృత్ 2.0 పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేసి ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

AMRUT 2.0 Works | హాజీపూర్​లో నర్సరీ పరిశీలన

హాజీపూర్ గ్రామంలో  నర్సరీని కలెక్టర్ పరిశీలించారు. వన మహోత్సవంలో కావాల్సిన మొక్కలను అందుబాటులోకి తీసుకువచ్చి వర్షాలు కురియగానే మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు ఆయిల్ పామ్ తోటల పెంపకంపై శ్రద్ధ చూపేలా అధికారులు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం గండి మాసానిపేట గ్రామంలోని పాల శీతలీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. పాడి పరిశ్రమ పెంపొందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. మహిళా సంఘాల అభివృద్ధికి పాడి పరిశ్రమ తోడు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం మాచాపూర్ అంగన్​వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ చిన్నారులకు గర్భిణులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. మాచాపూర్ గ్రామంలో జరుగుతున్న ఎస్​ఐఆర్​ నమోదు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. అర్హులైన ఓటర్లు తప్పిపోకుండా నమోదు చేయాలని బీఎల్​వోలకు సూచించారు. అవగాహన లేని ప్రజలకు ఫారాలు నింపి ఇవ్వాలన్నారు.

AMRUT 2.0 Works | మత్తమాల ఆరోగ్య కేంద్రం పరిశీలన

AMRUT 2.0 Works

మత్తమాల ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని రైతులకు ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకర్, తహశీల్దార్​ ప్రేమ్​, ఎంపీడీవో తాహేరా బేగం పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: GGH Workers Protest | జీజీహెచ్​ ఎదుట కార్మికుల ధర్నా.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *