Harish Rao Jupally Challenge | అప్పులపై జూపల్లికి హరీశ్ రావు లేఖ.. ప్రెస్ క్లబ్‌కు చేరుకున్న మంత్రులు

తెలంగాణ అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు , మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao Jupally Challenge | తెలంగాణ అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు , మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అప్పుల చిట్టాపై చర్చించేందుకు మంత్రి జూపల్లి విసిరిన సవాల్‌కు స్పందించిన హరీశ్ రావు, తాను లేఖ ద్వారా తన వాదనను స్పష్టం చేశారు. మరోవైపు, చర్చ కోసం మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు చేరుకున్నారు.

Harish Rao Jupally Challenge | రూ. 4.5 లక్షల కోట్ల అప్పు చేసిందని..

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తాము చేసిన అప్పు రూ. 4.17 లక్షల కోట్లు మాత్రమేనని, దీనిని అసెంబ్లీలో కూడా స్పష్టంగా చెప్పానని హరీశ్ రావు లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండున్నరేళ్లలోనే రూ. 4.5 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం గతంలో రూ. 3.47 లక్షల కోట్ల అప్పు ఉందని ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, మంత్రి జూపల్లి రోజుకో సవాల్‌తో గందరగోళం సృష్టిస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.

Harish Rao Jupally Challenge | మంత్రుల సవాల్..

తమ సవాల్‌కు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రెస్ క్లబ్‌కు చేరుకున్నారు. “తాను చెప్పిన లెక్కలు తప్పు అని తేలితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. దమ్ముంటే కేటీఆర్, హరీశ్ రావులు ఇక్కడికి వచ్చి చర్చలో పాల్గొనండి” అని మంత్రి సవాల్ విసిరారు. ప్రస్తుతం మంత్రులు ప్రెస్ క్లబ్‌లో వేచి ఉండగా, బీఆర్ఎస్ నేతలు చర్చకు వస్తారా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. అప్పుల లెక్కలపై ఇరు పార్టీల మధ్య సాగుతున్న ఈ పోరు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇది కూడా చదవండి:  Dubba High School | విద్యార్థుల అవస్థలు సర్కారుకు పట్టవా..?

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *