Telangana Road Works | రోడ్ల పనులు వేగవంతం చేయాలి : మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్రంలో రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అధికారులకు సూచించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Road Works | తెలంగాణ అంతటా ప్రపంచ స్థాయి రోడ్డు మౌలిక సదుపాయాలను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తెలిపారు. రోడ్డు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు. HAM రోడ్డు కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో దాదాపు రూ.13,000 కోట్ల అంచనా వ్యయంతో 34 ప్యాకేజీల కింద 6,092 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. నల్గొండ–మహబూబ్‌నగర్ మధ్య 42 కిలోమీటర్ల డబుల్ రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించిన ప్యాకేజీ-2 పనులు ఇప్పటికే ప్రారంభం కాగా, జూలైలో మరో 10 ప్యాకేజీల పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. పనుల అమలును వేగవంతం చేయాలని, వర్షాకాలం తర్వాత నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు రాత్రి వేళలతో సహా మూడు షిఫ్టుల్లో పనులు చేపట్టాలని ఆదేశించారు.

Telangana Road Works | జులై 6న శంకుస్థాపనలు

కరీంనగర్ జిల్లాలో హ్యాం, సీఆర్​ఎఫ్​ రోడ్డు ప్రాజెక్టులకు జులై 6న స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో శంకుస్థాపనలు జరుగుతాయని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. దీని కోసం ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. రాజేంద్రనగర్‌లో కొత్త హైకోర్టు భవన సముదాయం, న్యాయమూర్తుల నివాస గృహాల నిర్మాణ పనులపై సమీక్షించారు. కొత్త హైకోర్టు కాంప్లెక్స్, కొత్త ఉస్మానియా జనరల్ హాస్పిటల్ రెండింటినీ 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు.

Telangana Road Works | ఆలయాల అభివృద్ధిపై..

గోదావరి పుష్కరాల కోసం ఆర్&బీ శాఖ చేస్తున్న సన్నాహాలతో పాటు, బాసర, భద్రాచలంలోని ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి కోమటిరెడ్డి సమీక్షించారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని, అప్పగించిన పనులన్నింటినీ నిర్దేశించిన కాలపరిమితిలోగా పూర్తి చేయాలని సూచించారు.

దీనిని కూడా చదవండి : Kamareddy Heavy Rain | కామారెడ్డిలో కుండపోత.. రోడ్లపైకి చేరిన నీరు..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *