Bear Attack | ఎలుగుబంటి దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు.. రెడ్డిపేట స్కూల్ తండాలో ఘటన

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి: Bear Attack | కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటన రామారెడ్డి మండలం (Ramareddy Mandal) రెడ్డిపేట స్కూల్ తండాలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

Bear Attack | రెడ్డిపేట స్కూల్​ తండాలో..

తండా వాసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన సలావత్ మత్తు ప్రతిరోజూ మాదిరిగానే కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఎలుగుబంటి మత్తుపై దాడి చేసింది. తలను పట్టుకోవడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతని భార్య, అడవిలో బీడీ ఆకు కోసం వెళ్లిన మహిళలు గట్టిగా అరవడంతో ఎలుగుబంటి అక్కడినుంచి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన మత్తును కామారెడ్డి జీజీహెచ్ (Kamareddy GGH)​కు తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ జీజీహెచ్​కు తరలించారు.

Bear Attack | పులి కాదు.. ఎలుగుబంటి..

అయితే మత్తుపై దాడి చేసింది పులి అంటూ ప్రచారం జరిగింది. దాంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల మాచారెడ్డి మందళంలో పెద్దపులి సంచరిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుండడంతో పులి దాడి ఘటన నిజమేనని నమ్మారు. ఓసారి పెద్దపులి, మరోసారి చిరుత పులి అంటూ ప్రచారం సాగించారు. చివరికి తండా వాసులు దాడి చేసింది పులి కాదని, ఎలుగుబంటి అని చెప్పడంతో పులి దాడి ప్రచారానికి తెరపడింది.

ఇది కూడా చదవండి..: RTC Strike | నగరంలో ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో.. రహదారులు దిగ్బంధనం

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *