Steroid Injections Seized | భారీగా స్టెరాయిడ్స్​ ఇంజెక్షన్లు స్వాధీనం.. వాడరంటే అంతే సంగతులు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Steroid Injections Seized | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో పెద్ద ఎత్తున స్టెరాయిడ్స్‌ ఇంజెక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిమ్‌కు వచ్చేవాళ్లకు కండలు పెరిగేందుకు వీటిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

కండల కోసం కొందరు జిమ్​ ట్రైనర్లు వారి వద్దకు వచ్చే యువతకు స్టెరాయిడ్​ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. బాడీ ఫిట్‌గా ఉంటుందని ఇంజెక్షన్లతో పాటు సప్లిమెంట్స్‌ సరఫరా చేస్తున్నారు. తాజాగా పోలీసులు ముషీరాబాద్​ (Musheerabad)లో సోదాలు నిర్వహించారు. రూ.6.50 లక్షల విలువైన 770కి పైగా స్టెరాయిడ్స్ వయల్స్, యాంపూల్స్ స్వాధీనం చేసుకున్నారు. జిమ్ ట్రైనర్ బట్టే శివ, మహమ్మద్ ఫుర్ఖానుద్దీన్ ఫైసల్‌తో పాటు మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

Steroid Injections Seized | ఆన్​లైన్​లో కొనుగోలు

నిందితులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ‘మెడ్‌హౌస్ ఫార్మా’, పంజాబ్‌కు చెందిన ‘షిప్ రాకెట్’ వంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా స్టెరాయిడ్స్​ కొనుగోలు చేస్తున్నారు. కొరియర్ ద్వారా హైదరాబాద్‌కు తెప్పించి తక్కువ కాలంలో కండలు పెరగాలనుకునే యువతకు విక్రయిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొంతమంది యువకులు ఏఐ సాయంతో నకిలీ ప్రిస్క్రిప్షన్లు రూపొందించి మెడికల్ షాపుల నుంచి కూడా స్టెరాయిడ్స్ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు.

Steroid Injections Seized | ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

వైద్యుల సలహా లేకుండా స్టెరాయిడ్​ ఇంజెక్షన్లు వాడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వీటిని వాడితే లైంగిక సామర్థ్యం దెబ్బ తినడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. హై బీపీ, కిడ్నీల ఫెయిల్యూర్, ప్రొస్టేట్ క్యాన్సర్​ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బులు రావడంతో పాటు, కండరాల వ్యాధులు, కాలేయం చెడిపోతుందన్నారు. ఇలాంటివి వినియోగించకుండా.. వర్కౌట్ల ద్వారా బాడీ పెంచాలని వైద్యులు సూచిస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Hyderabad Food Adulteration | ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్ ఉక్కుపాదం.. 185 కేసులు నమోదు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *