అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Alluri Jayanthi Tribute | అన్యాయాన్ని ప్రశ్నించడమే అల్లూరి సీతారామరాజుకి మనం ఇచ్చే నిజమైన నివాళి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. 27 ఏళ్ల ప్రాయంలోనే దేశ స్వాతంత్య్రం కోసం, గిరిజనుల హక్కుల కోసం అల్లూరి చేసిన త్యాగం అనిర్వచనీయమని కొనియాడారు. ప్రజల కోసం, ప్రజల ద్వారా, ప్రజల కోసమే సాగిన ఆయన విప్లవ పోరాటం నేటి తరానికి నిరంతర స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అల్లూరి ఒక వ్యక్తి మాత్రమే కాదని, స్వేచ్ఛాకాంక్ష గల ప్రతి భారతీయుడి గుండెల్లో కొలువై ఉన్న ఒక గొప్ప శక్తి అని అభివర్ణించారు.
Alluri Jayanthi Tribute | అంబులెన్స్ అందజేత
జయంతి వేడుకల్లో భాగంగా క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో సమకూర్చిన అంబులెన్స్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ అధికారులకు అందజేశారు. పోలీసుల విధి నిర్వహణలో, ముఖ్యంగా అత్యవసర సమయాల్లో ఈ అంబులెన్స్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
దీనిని కూడా చదవండి : Rythu Bharosa Funds | 6 ఎకరాల వరకు రైతు భరోసా జమ