Poor Housing Scheme | పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యం : మంత్రి పొన్నం

పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Poor Housing Scheme | పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్​ (Ponnam Prabhakar) అన్నారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో వివిధ వృత్తుల్లో ఉపాధి చేసుకుంటున్నా పేదలకు అదే ప్రాంతంలో ఇళ్లు నిర్మించి అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

హైదరాబాద్ కలెక్టరేట్​లో ఆదివారం పలువురికి డబుల్​ బెడ్​ రూం ఇళ్లను అందజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత పదేళ్లుగా గృహాల కోసం ఎదురుచూసిన లబ్ధిదారులు పడిన ఇబ్బందులను ప్రభుత్వం గుర్తిస్తోందని, ఆ జాప్యానికి ప్రభుత్వ ప్రతినిధిగా విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఇకపై అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలులో ఇటువంటి ఆలస్యం జరగకుండా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు.

Poor Housing Scheme | పని చేసే ప్రాంతంలో..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో ప్రభుత్వం పేదల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని గృహ నిర్మాణ విధానాన్ని రూపొందించిందని తెలిపారు. పేదలు పని చేసే ప్రాంతాలకు దూరంగా కాకుండా, వారు ఉపాధి చేసుకుంటున్న ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మించి అందించేందుకు విలువైన ప్రభుత్వ భూములను కూడా వినియోగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు

Poor Housing Scheme | 48 గంటల్లో రేషన్​ కార్డు

అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందించామని మంత్రి తెలిపారు. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే రేషన్ కార్డు జారీ చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రేషన్ కార్డుతో పాటు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ, అర్హత గల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.

దీనిని కూడా చదవండి : Kishan Reddy HYDRAA | పేదలకు బుల్డోజర్లు.. ఎంఐఎంకు రక్షణ: రేవంత్ సర్కార్‌పై కిషన్ రెడ్డి ఫైర్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *