అక్షరటుడే, బాన్సువాడ: Birkur Food Poisoning | బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. రాత్రి భోజనం అనంతరం సుమారు 20 మంది విద్యార్థులు విరోచనాలు, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు.
Birkur Food Poisoning | బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలింపు..
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని గమనించిన కళాశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై రాత్రి 11 గంటల సమయంలో అంబులెన్స్‌ల ద్వారా బాన్సువాడ (Banswada) ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బీర్కూర్ సర్పంచ్ అరిగే ధర్మతేజ సోమవారం ఉదయం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. అనంతరం ప్రిన్సిపాల్ శివకుమార్‌ను కలిసి ఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని కళాశాల యాజమాన్యానికి సర్పంచ్ సూచించారు. ఫుడ్ పాయిజన్‌కు గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది.
ఇది కూడా చదవండి..: Tadwai Bus Stand | ఆ బస్టాండ్‌కు బస్సులు రావు.. ఆకతాయిలకు అడ్డాగా మారిన వైనం