అక్షరటుడే వెబ్‌డెస్క్: Prakash Raj UAPA | ప్రముఖ యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’పై ‘ఉపా’ (UAPA) వంటి కఠినమైన చట్టాలను ప్రయోగించడంపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా ఆయన మరోసారి తన గళం వినిపిస్తూ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు.
Prakash Raj UAPA | తప్పుడు కేసులు బనాయిస్తోందని ..
యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై ప్రభుత్వం వరుసగా తప్పుడు కేసులు బనాయిస్తోందని ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. ఇప్పటికే కోర్టు ఈ కేసుల్లో అతనికి బెయిల్ మంజూరు చేసినా, తాజాగా అన్యాయంగా UAPA చట్టాన్ని ప్రయోగించి మళ్ళీ రిమాండ్‌కు పంపడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఒక యూట్యూబర్‌ను ప్రశ్నించినందుకు దేశద్రోహం కింద పరిగణిస్తారా? అహా.. జస్ట్ ఆస్కింగ్!” అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
Prakash Raj UAPA | ప్రశ్నించే గొంతులను నొక్కడమేనా?
ప్రశ్నించే గొంతులను నొక్కడానికే ప్రభుత్వం ఇటువంటి కుట్రలు చేస్తోందని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన పలు అంశాలను ప్రస్తావిస్తూ, సోషల్ మీడియాలో ఏఐ (AI) వీడియోలు, తప్పుడు ఫొటోల ద్వారా జనసైనికులు ‘ప్రశ్న రావణ్’ వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పోలీసుల ఆధీనంలో ఉండాల్సిన సదరు యూట్యూబర్ ఫోన్ జనసైనికుల చేతుల్లోకి ఎలా వెళ్లిందని ప్రశ్నించిన ఆయన, ఆ ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చివరగా “ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారితో మొదలైన మీ ఆటలకు ముగింపు ప్రజలే ఇస్తారు” అని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మీరు ఆట మొదలు పెట్టారు… ప్రజలు దాన్ని ముగింపు చేస్తారు GAME ON #justasking pic.twitter.com/febENen78z
— Prakash Raj (@prakashraaj) July 6, 2026
ఇది కూడా చదవండి: Birkur Food Poisoning | గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత