Police Recruitment Posts | పోలీస్​ నియామక పోస్టులను పెంచాలని నిరుద్యోగుల ర్యాలీ..

పోలీసు శాఖలో 20 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని సామాజిక తెలంగాణ ఫ్రంట్ ప్రతినిధులు డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Police Recruitment Posts | రాష్ట్ర ప్రభుత్వం(Telangana) విడుదల చేయనున్న పోలీస్​శాఖ నోటిఫికేషన్​ను (Police Recruitment) మార్చాలని సామాజిక తెలంగాణ ఫ్రంట్​ డిమాండ్​ చేసింది. ఈ మేరకు నగరంలో సెంట్రల్​ లైబ్రరీ నుంచి కలెక్టరేట్​ వరకు నడక ద్వారా ఫ్రంట్​ ప్రతినిధులు, నిరుద్యోగులు నిరసన తెలిపారు.

Police Recruitment Posts | 20వేల ఖాళీలు ఉంటే..

తెలంగాణ సామాజిక ఫ్రంట్​ ప్రతినిధులు మాట్లాడుతూ.. పోలీస్​శాఖలో 20వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 5వేల వరకు మాత్రమే నోటిఫికేషన్( Job Notification)​ విడుదల చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. లక్షల సంఖ్యలో నిరుద్యోగులు నోటఫికేషన్​ కోసం ఎదురుచూస్తుంటే ప్రభుత్వం అత్తెసరుగా 5వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్​ ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారుల వయస్సును 38వరకు పెంచాలని డిమాండ్​ చేశారు.

front11

ఇది కూడా చదవండి: పట్టణ మరియు గ్రామీణ ప్రణాళికా శాఖలో 10 అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టుల భర్తీకి TGPSC దరఖాస్తుల ఆహ్వానం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *