GGH Constable Humanity | మానవత్వం చాటిన జీజీహెచ్ కానిస్టేబుల్

కామారెడ్డి జీజీహెచ్​లో పోలీస్ ఔట్ పోస్ట్ కౌంటర్​లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు మానవత్వం చాటారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: GGH Constable Humanity | కామారెడ్డి(Kamareddy) జీజీహెచ్​ పోలీస్ ఔట్ పోస్ట్ కౌంటర్​లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు మానవత్వం చాటారు. వివరాలు ఇలా ఉన్నాయి.

GGH Constable Humanity | క్షతగాత్రుడి వస్తువులు అందజేత

తాడ్వాయి(Tadwai) మండలం దేమికలాన్ గ్రామానికి చెందిన అంబీర్ లక్ష్మణ్ రావు సోమవారం నిజామాబాద్​లో ఫంక్షన్​కు వెళ్లాడు. తిరిగి బైక్​పై కామారెడ్డికి వస్తుండగా గన్నారం ప్లాంట్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం కావడంతో పాటు ఒక కాలు విరిగింది. ప్రమాదంలో సృహ కోల్పోవడంతో అంబులెన్స్​లో జీజీహెచ్​కు(Kamareddy GGH) తరలించారు. ఆస్పత్రిలో అతనికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. అయితే లక్ష్మణ్ రావు వద్ద ఉన్న పర్సులో 3 తులాలు బంగారు పుస్తెల తాడు, రూ.2,550 నగదు ఉండగా వాటిని జాగ్రత్త చేసిన కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు.. బాధితుడి కొడుకు గోపిరావుకు అందజేశారు.

ggh kamareddy

ఇది కూడా  చదవండి: ఇండోనేషియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *